ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 21, ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముస్తాబాద్ ప్రభుత్వ హోమియో వైద్యురాలు శిశుప్రభ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి యోగాభ్యాసముపై అవగాహన కల్పించి కొన్ని యోగాసనాలను నేర్పించడం జరిగినది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. యోగ ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది.. చివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే యోగాను భారతదేశానికి పుట్టినిల్లుగా భావిస్తారు. యోగా చేయడంవల్ల ఎన్నో రకాలు ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చేయడంవల్ల గొప్ప ఉపశమనం లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి శనిగరం సుధాకర్, బాలుర పాఠశాల ఇంచార్జ్ వెంకట రామారావు, మరియు ఉపాధ్యాయ బృందం పీడీ బుచ్చిరెడ్డి, పిఈటి సంధ్యారాణి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
