దౌల్తాబాద్: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్ మామ నాగయ్య మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న బీజేపీ దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్, నాయిని రాజగోపాల్ శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. నాగయ్య మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చెట్ల నర్సంపల్లి సర్పంచ్ వేమ జనార్ధన్, ఉప సర్పంచ్, కేశబోయిన ప్రభాకర్ తదితరులు ఉన్నారు
