ప్రాంతీయం

ఫిబ్రవరి 7న హలో మాదిగ చలో హైదరాబాద్

62 Views

-వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన విజయవంతం చేద్దాం

కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 07 న మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్ష డప్పులు మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు, సంఘాలకు అతీతంగా తరలి రావాలని ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి పిలుపునిచ్చారు.సోమవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శన వాల్ పోస్టర్స్ ను విడుదల చేశారు.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలాధ్యక్షులు సళ్ల శ్రీను,అంబేద్కర్ సంగం నాయకులు డాకని భిక్షపతి,గుండ్ర నర్సయ్య,నర్సింలు,నర్సింలు,చంద్రయ్య,శివులు,సాయిలు,ఎల్లం,సత్తయ్య,రామచంద్రం,డాకని నర్సింగరావు,చిత్ర ఆర్ట్స్ నర్సింలు,కృష్ణ,మల్లేశం,రాజు,జి.యాదగిరి,లింగం,స్వామి,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found