రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలస్థాయి స్పెల్-బీ, స్టోరీ టెల్లింగ్ పరీక్ష శనివారం కేజీ టు పీజీ ప్రాంగణంలో జరిగింది. సుమారు 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. స్టోరీ టెల్లింగ్ విభాగంలో. అక్షితా(ముచ్చర్ల), భావన లింగన్నపేట ప్రథమ, ద్వీతీయ బహుమతులు విద్యార్థినిలు అందుకున్నారు.స్పెల్-బీ విభాగంలో, సంజన(ముచ్చర్ల), అభిజ్ఞ లింగన్నపేట గ్రామ విద్యార్ధినిలు బహుమతులు అందుకున్నారు.లయన్స్ క్లబ్ చేయూతపోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, ఉపాద్యాయులకు గంభీరావుపేట లయన్స్ క్లబ్ భోజన వసతి కల్పించింది. అదే విధంగా విజేతలకు అందించిన బాహుమతులను సమకూర్చింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ పంతుల వారి శంకర్, సభ్యులు పెద్దవేని వెంకట్ యాదవ్, సంతోష్ రెడ్డి, చెపూరి కిషన్, పోతుల నారాయణ, ఎర్ర శ్రీనివాస్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
