ప్రాంతీయం

అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఈ పంచాయతీ ఆపరేటర్లు

109 Views

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో ఈ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్ర వారం జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను కలసి , పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఈ పంచాయతీ అధ్యక్షులు పులుగారి నవీన్ గౌడ్, గౌరవ అధ్యక్షులు మంద లక్ష్మణ్, ఉపాధ్యక్షులు చల్లారం వెంకట్ రాజిరెడ్డి లు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఈ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తూ మండలాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిని అంతర్జాలంలో నమోదు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పల్లె ప్రగతి, ఈ గ్రామ స్వరాజ్, ఆసరా పథకాలను విజయవంతం చేయడంలో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా కీలక పాత్ర పోషిస్తున్నామని, గ్రామ పంచాయతీ ల్లో జనన మరణాలను, అంతర్జాలం లో పొందుపరుస్తున్నామని, ఇంటి నిర్మాణానికి అనుమతులు, వ్యాపార దుకాణదారుల లైసెన్స్ ల ను ఆన్ లైన్ ద్వారా అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతం చేస్తున్నామని అలాంటి మాకు ప్రభుత్వం మా సేవలను గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి, పనికి తగిన వేతనం అందించి అదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బరిగే నర్సింలు, కోశాధికారి సంతోష్, సభ్యులు, పర్శరాములు, రాజేందర్ నాగరాజు,సుభాష్, కిషన్, రాజు తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh