గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2 వ వార్డులో సిసి రోడ్డు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సారథ్యంలో గజ్వేల్ గణనీయమైన అభివృద్ధి చెందుతుందని,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో దశల వారీగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కొనసాగుతున్నాయని సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని సీఎం కేసీఆర్ గజ్వేల్ మీద ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని పట్టణ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, 2 వ వార్డ్ కౌన్సిలర్ బాలమణి శ్రీనివాస్ రెడ్డి, బాబ్బురి రజిత, ఉప్పల మెట్టయ్య,రహీం, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ ఆర్కే శ్రీనివాస్,నాయకులు సమీర్, తదితరులు పాల్గొన్నారు