ప్రాంతీయం

జవానుల పోరాటం చిరస్మరణీయం

62 Views

జవానుల పోరాటం చిరస్మరణీయం: ఎబివిపి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించిన ఏబీవీపీ.

సిద్దిపేట జిల్లా జూలై 26

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మా విషయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్సిసి కోఆర్డినేటర్ మహేందర్ సార్ అలాగే ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్ పుష్పార్చన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ” భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయాలని పాకిస్థాన్ కన్న కలలను.. కలలుగానే మిగిల్చిన యుద్ధం అది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రుసైన్యాన్ని తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన పోరాటమది. మన సైన్యం ధాటికి భారత భూభాగాలను ఆక్రమించాలని చూసిన పాకిస్థాన్ దళాలు తోకముడిచి.. చివరికి సొంత దేశానికే పుట్టెడు అవమానాన్ని మిగిల్చాయి. 1999లో పాకిస్థాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి శుక్రవారం నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వీర సైనికులకు నివాళులు, కార్గిల్ విజయ దివాస్ శుభాకాంక్షలు.అదే విధంగా భారతదేశం యువత అందరూ కూడా ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం ఆలోచించాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్ , నగర కార్యదర్శి పరుశురాం , ఉపాధ్యక్షుడు ఫణిందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్