ముస్తాబాద్ జనవరి 3, ముస్తాబాద్ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం సందర్భంగా టిఎల్ఎం వేదిక ఏర్పాటుతొ పాఠశాల వాతావరణం సందడిగా మారాయి. ఎంఈఓ విటల్ నాయక్, బాలికలపాఠశాల ప్రధానోపాధ్యయుడు రవీందర్ మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన భారతీయ సంఘసంస్కర్త, కవయిత్రి, విద్యావేత్త భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి కులవ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడి విద్యద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేసిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 1831 జనవరి 3వ తేదీన నైగావ్ గ్రామంలో లక్ష్మి ఖండోజీ నెవాసే పాటిల్‌ల పెద్ద కుమార్తెగా నాడు తమ చదువుల కోసం పోరాడిన మొట్టమొదటి మహిళా సావిత్రి పూలే జన్మదిన సందర్భంగా టిఎల్ఎం వేదికను మంగళవారం రోజున ఏర్పాటుచేసి తప్పనిసరిగా టీఎల్ఎం ద్వారానే విద్యార్థులకు బోధించాలని అన్నారు. మండలంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలిమెట్టు టీఎల్ఎం మేళా కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు హాజరై సావిత్రి పూలే కి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాటైంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఒకరికి ఒకరు మహమ్మారి కరోనా అంటువ్యాధి కారణంగా విధించిన లాక్ డౌన్ వలన తగ్గిన విద్యాసంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని యావత్ ప్రపంచం కోవిడ్ కేసులు తగ్గేవరకు లేదా వ్యాక్సిన్ వచ్చేంతవరకు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపమని చెబుతూ ఇలాచాలా దుర్భరమైన పరిస్థితి నెలకొని ఉండెను అన్నారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎం సామగ్రిని పరిశీలించి ఆయన విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానం, రాయడం, చదవడంతో పాటు గణితంలో వివిధ అంశాలపై పట్టు సాధించేలా ప్రణాళికలను రూపొందిచాలని ప్రతి పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ఏగ్రేడ్‌లో ఉండేటట్లుగా వారిని తీర్చిదిద్దాలని పలుసూచనలనిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ గాండ్లసుమతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
