
చందాపూర్ ప్రాథమికొనంత పాఠశాల లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను జరిపారు ఈ సందర్బంగా *దళిత బహుజన ఉద్యమ జిల్లా నాయకులు చందా రాజు* మాట్లాడుతూ భారతీయ సామాజిక ఉద్యమ కారిణి,భారత తొలి ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందన్నారు.
అదేవిధంగా
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్ధేశ్వర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి జీవితంలో విజయం సాధించడమే కాకుండా స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచారని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బాలబాలికలు చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అరుణశ్రీ మేడం గారు, గంగా మేడం గారు, సతీష్ కుమార్ గారు, ఆంజనేయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




