ప్రాంతీయం

కస్తూర్బా విద్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు…

122 Views

    ముస్తాబాద్ ప్రతినిది (కస్తూరి వెంకట్ రెడ్డి) జనవరి 3, భారతీయ సంఘసంస్కర్త, విద్యావేత్త మరియు కవయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బావిద్యాలయంలో ఎంపీడీవో రమాదేవి, కస్తూర్బా ప్రిన్సిపాల్ శ్రీలత, కుర్ర రాకేష్ వీరు మాట్లాడుతూ ఆమెను స్పూర్తిదాయకమైన సావిత్రీబాయి ఫూలే జీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులులర్పించారు. ఆమె మన నారీ శక్తి యొక్క తిరుగులేని స్ఫూర్తిని వ్యక్తీకరించింది. ఆమె జీవితం మహిళలకు విద్య మరియు సాధికారత కోసం అంకితం చేయబడింది. సామాజిక సంస్కరణ మరియు సమాజ సేవపై ఆమె దృష్టి కేంద్రీకరించడం కూడా అంతే స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. దేశంలో కుల వివక్షతకు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి ఫూలే పోరాడారు. మహిళల హక్కులను మెరుగుపరచడంలో, మహిళ విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. దేశంలో తొలితరం మహిళా ఉద్యమకారిణిగా, మార్గదర్శకురాలిగా సావిత్రిబాయి ఫూలే గుర్తింపు పొందారని తెలిపారు. ఈకార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయునిలు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, హాస్టల్ వార్డెన్లు విద్యార్థినిలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్