ముస్తాబాద్, ఫిబ్రవరి 14 (24/7న్యూస్ ప్రతినిధి) చీకోడ్ గ్రామస్తుల రేకులకుంట శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం సుమారుగా 500 సంవత్సరాల పైచిలుకు పురాతనమైన దేవాలయ మార్గం పూర్వము ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు సోలార్ ప్లాంటేషన్ అమర్చిన తర్వాత ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా ఉండడంచేత ఇదివరకే కలెక్టర్ కు మాగ్రామస్తులు అందరం కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు దయచేసి శ్రీ మల్లికార్జున దేవస్థానానికి రోడ్ మార్గం వీలు అయినంత త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు వినతిపత్రం అందివ్వడంతో తొందరలోనే రోడ్ మార్గం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యాలయం సహాయ కార్యదర్శి బాధ నరేష్, ఊరడి రాజు బూత్ అధ్యక్షులు, గూడబాలేశ్వర్ రెడ్డి, గున్నాలసాయి, నవీన్, మల్లయ్య, గూడ బాలరాజురెడ్డి, పిట్లఎల్లం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
