రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన సోలేటి సాంబయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి శనివారం ఉదయం పరామర్శించి ఓదార్చి 5000 రూపాయల నగదును వారికి అందజేసి అండగా నిలిచాడు. వీరి వెంట తెరాస నాయకుడు నాగుల ప్రదీప్ గౌడ్, వార్డు సభ్యుడు కొడిమోజు దేవేందర్, శ్యామంతుల అనిల్, మిత్ర యూత్ అద్యక్షులు స్వామి గౌడ్,యూనియన్ రాములు, ముద్రకోల సంతోష్, దోమల భాస్కర్, బందారపు బాల్రెడ్డి, బొల్లు భూమయ్య తదితరులు పాల్గొన్నారు
