కోనరావుపేట: మెరుగైన ఆరోగ్య సమాజం కోసం కరీంనగర్ చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యంతో ఇంటింటికి హెల్త్ చెకప్ చేసి వైద్య సేవలు అందిస్తుందని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మెరుగైన ఆరోగ్య సమాజం కోసం ప్రజల్లో వచ్చే వ్యాధులను క్యాన్సర్ షుగర్ బిపి రక్తహీనత థైరాయిడ్ మొదలగు వ్యాధులనుతొలిదశలో గుర్తించి వారికి ముందస్తుగా వైద్య సేవలు అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని గ్రామంలో సుమారు 4000 మందికి చెల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని 336 మందికి బీపీ 132 మందికి షుగరు 38 మందికి థైరాయిడ్ ఉన్నట్లుగా గుర్తించామని వారికి వైద్య సేవలు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే అవసరమైన వారికి ఉచితంగా గ్రామానికి బస్సు పంపించి హాస్పిటల్కు తీసుకువెళ్లి సిటీ స్కాన్ ఆపరేషన్ ఎంఆర్ఐ మొదలగు పరీక్షలు చేసి మందులు ఇచ్చి పంపించడం జరుగుతుందని శరీరం ఒక యంత్రం లాంటిదని దానిని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యతని సెల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా1000పడకలు వైద్య సేవలు ముక్యంగా 100 పడకలతో క్యాన్సర్ హాస్పిటల్ తో సేవలు అందించడం జరుగుతుందని ప్రజలందరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మల్కపేట గ్రామంలోని రిజర్వాయర్ కట్టపై రామలయాన్ని నిర్మాణాన్ని తమ తండ్రి ఆనందరావు కోరిక మేరకు సొంత ఖర్చులతో రామలయ్యని నిర్మిస్తున్నామని రానున్న రోజుల్లో పర్యటక కేంద్రంగా మారుతుందని ప్రజలకు సేవ చేయడంలో ఎల్లవేళలా ముందు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపిటిసి చారి, ఆరే మహేందర్, జీవన్ గౌడ్, మందాల శ్రీనివాస్, నారాయణ, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు చెల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
