చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హెచ్చరించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు.. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ శాంతియుత వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని. విధులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు..




