Breaking News

సంపూర్ణ మద్దతు

196 Views

బండారి లక్ష్మారెడ్డికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

అక్టోబర్ 26, ఉప్పల్.

ఉప్పల్ డివిజన్, లక్ష్మీ నగర్ కాలనీలోని డైమండ్ ప్రింటింగ్ ప్రెస్ ని బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్(ఎస్ ఎస్ ఐ ) ప్రెసిడెంట్ అలగ్జాండర్, బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తగిన సలహాలు సూచనలు చేశారు. మీ అసోసియేషన్ కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అంటూ భరోసా ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఉప్పల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తాం అంటూ ఏకగ్రవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు ఇండస్ట్రీ ఓనర్స్ మరియు అసోసియేషన్ నెంబర్స్, కృష్ణ, విజయ్, శ్రీనివాస్, ఆదినారాయణ, వైజాగ్ శీను, నాగేశ్వరావు, చంద్రమౌళి, శివారెడ్డి, రామకృష్ణ, జహంగీర్, బిఆర్ఎస్ నేతలు రాములు, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *