రైతులకు యాసాంగి పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం యాసంగి పంటల కోసం రైతుల ఖాతాలలో రైతుబంధు జమచేయనుంది. చిన్న సన్నకారు రైతులందరికీ ఒక ఎకరా ఉన్న రైతులకు రైతుల ఖాతాలలో వేయడం జరిగిందని ఉన్నారు. మిగతా రైతులకు రెండు మూడు రోజులలో ఆ రైతులకు ఖాతాలలో రైతుబంధు డబ్బులను జమ చేయడం జరుగుతుందని రాయపోల్ రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 5,000/- వేల చొప్పున పంటల సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి పది వేల రూపాయలు పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు వారి ఖాతాలలో రూపంలో ఇవ్వనున్నారు అని రైతన్నలకు తెలియజేశారు.
