రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలుగా వర్ణించక తప్పదు ఎందుకంటే ప్రతి గ్రామపంచాయతీలో నిధులు లేక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక వచ్చిన 15 ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ఖజానాకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీకి నిధులు ఇవ్వాలని ఉద్దేశంతో సర్పంచ్ ఉప సర్పంచ్ కు అకౌంట్లు తీసి ఒక డిజిటల్ కి ఇవ్వడం జరిగింది. 15 ఫైనాన్స్ సంబంధించిన నిధులు నేరుగా గ్రామపంచాయతీలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ షిఫ్ ని యాక్టివేట్ చేయాలని గ్రామపంచాయతీ సెక్రెటరీ ద్వారా సర్పంచ్ ఉప సర్పంచ్ షిప్ లను తీసుకొని డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి 15 ఫైనాన్స్ నిధులు గ్రామపంచాయతీ ఖాతాలో పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు తీసుకోవడం సిగ్గుచేటు అని రాయపోల్ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు గ్రామపంచాయతీలలో నిధులు లేక గ్రామపంచాయతీలలో చెత్తకు బూట్టకు ఇబ్బంది అవుతున్న తరుణంలో పారిశుద్ధ కార్మికుల జీతాలకు ఇబ్బంది అవుతున్న ఇవన్నీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరైన పద్ధతి కాదని గ్రామ సర్పంచులకు ఎంత ఇబ్బంది అయితుందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు. ఈరోజు విధులు మళ్లించి గ్రామాల సర్పంచ్లను మరియు ప్రజలను ఇబ్బందులకు గురిచేద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నామన్నారు మన గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు మళ్లించడం ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ దీనికి ఖండించాలి. మన నిధులు మనకు మళ్ళీ గ్రామపంచాయతీ ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా సర్పంచులు దీని ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నేను కూడా ఒక ఉప సర్పంచ్ గా రాయపోలు మండల ఉపసర్పంచ్ ఫోరం జనరల్ సెక్రటరీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.




