ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరమర్శించిన – బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కమార్

117 Views

రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చేందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పలుఫునూరి భుచ్ఛిరెడ్డీ అనరోగ్యానికి గురై మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కమార్ సోమవారం అయన స్వగ్రామమైన అంకిరెడ్డిపల్లి గ్రామంలో బాధిత కుటుంభ సభ్యులను వారి కుమారులను పరమర్శించి ఓదార్చారు. అంకిరెడ్డి పల్లి, రాంసాగర్, వీరనగర్ గ్రామాల్లో భుచ్ఛి రెడ్డికి మంచి ప్రేమనురగాలు ఉండడంతో పాటు నమ్మిన సిద్దంతాల కోసం పని చేసిన వ్యక్తి పాలుపునూరి బుచ్చిరెడ్డి అని చిందం రాజుకుమార్ కొనియాడారు. ఆయన మృతి బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు అని గుర్తు చేశారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ నిరుత్సాహం చెందకుండా ప్రజలే నా ప్రాణంగా భావించి కష్టసుఖాలలో పాలుపంచుకున్నారని చిందం రాజుకుమార్ అన్నారు. మూడు గ్రామాలకు చెందిన వ్యక్తి బుచ్చిరెడ్డి అకాల మరణంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యామని బుచ్చిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం ప్రకటిస్తున్నట్లు చిందం రాజుకుమార్ పేర్కొన్నారు. ఆయన వెంట రాయపోల్ మండల సర్పంచుల ఫోరంఅధ్యక్షులు గ్రామ సర్పంచ్ వెంకట నరసింహ్మరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణంపల్లి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka