ముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణరాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల బిజెపిపార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు దీక్ష నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గతతొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ నష్టపోయిన రైతులకు ఆర్థికసహాయం అందించలేదు రైతురుణమాఫీ చేయలేదు అదే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడిన వందరోజుల తర్వాత ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు రైతులకు రెండులక్షల రుణమాఫీచేస్తా అన్నారు చేయలేదు. క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారు ఇయ్యలేదు. అదేవిధంగా వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ మండలపార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముస్తాబాద్ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, ముస్తాబాద్ టౌన్ ప్రెసిడెంట్ మేంగని మహేందర్, మట్ట వెంకటేశ్వర రెడ్డి, మీససంజీవ్, ఏళ్ల గిరిధర్ రెడ్డి, చిట్టినేని శ్రీనివాసరావు, కుడుకల జనార్ధన్ యాదవ్, బాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఎదునూరి గోపి, రమేష్ గౌడ్, తిరుపతి, ప్రభాకర్ రెడ్డి చీకోటి మహేష్ రైతులు పాల్గొన్నారు.
