ప్రాంతీయం

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

116 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఉదయం నుంచే చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంతో చర్చిలో క్రీస్తు పాటలతో మారుమ్రోగాయి. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బేతేలు ప్రార్థన మందిరంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, ఇంచార్జ్ సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో సపాయి కార్మికులకు బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నర్ర రాజేందర్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సల్ల స్వామి, ప్రశాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh