మంచిర్యాల జిల్లా.
జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకలు.
మన మంచిర్యాల జిల్లా ఐ.డి.ఓ.సి కార్యాలయ ఆడిటోరియం లో జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని,మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీ .కీర్తి రాజ్ వీర్ మరియు
రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటి మంచిర్యాల టీం చేస్తున్న సేవలను గుర్తించి రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీమ్ మరియు ప్రేమ్ కుమార్ సింగ్ ను సహృదయంతో షాల్వ తో సన్మానించి మరియు వారికి షెల్డ్ నీ అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నా మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీ. కీర్తి రాజ్ వీర్, యువతరం తిరుపతి, మంచిర్యాల జిల్లా బాక్సింగ్ కోచ్ రాజేష్ మరియు మంచిర్యాల జిల్లా యువజన సంఘాల సభ్యులు, మరియు యువజన మహిళా సంఘాలు పాల్గొనీ విజయవంతం చేసినారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ
మీరు మాకు కల్పించిన స్ఫూర్తి తో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ,సదా మీ సేవలో రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ మంచిర్యాల జిల్లా.అబ్దుల్ రహీమ్.





