ప్రాంతీయం

ప్రసాద్ రెడ్డి అకాల మరణం బాధాకరం బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

132 Views

ప్రసాద్ రెడ్డి అకాల మరణం బాధాకరం
బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు


తొగుట: ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన యువ నాయకుడు దామరంచ ప్రసాద్ రెడ్డి అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి గారి సోదరుని కుమారుడు ప్రసాద్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.. గజ్వెల్ లోని ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రసాద్ రెడ్డి కుటుంబీకులను ఎంపీ గారు పరామర్శించారు..ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు..అనంతరం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాయపోల్ మండలంలోని కొత్తపల్లి కి చెందిన రాజాగౌడ్ ను ఎంపీ గారు పరామర్శించారు..అలాగే తొగుట మండలంలోని జప్తిలింగారెడ్డి పల్లికి చెందిన స్వామి గౌడ్ ను ఎంపీ గారు పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు..మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులను కోరారు..
వర్గల్ రాంరెడ్డి కి శుభాకాంక్షలు
వర్గల్ రాంరెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈసందర్భంగా ఎంపీ గారిని ఆయన సన్మానించారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7