క్రీడలు

వర్గల్ మండల్ : మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మసామర్ధ్యం పెంపొందుతుంది

121 Views

వర్గల్ మండల్:

క్రీడలతో మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మసామర్ధ్యం పెంపొందుతుంది*

క్రీడలతో మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మసామర్ధ్యం పెంపొందుతుందని నెహ్రూ యువకేంద్ర జిల్లా సహాయ సమన్వయ అధికారి కిరణ్ కుమార్ అన్నారు నెహ్రూ యువకేంద్ర సహకారంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ లేవల్ వర్గల్ మరియు ములుగు మండలాల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు జబ్బపూర్ లో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు జాతీయ యువజన అవార్డు గ్రహిత దేశాబోయిని నర్సింహులు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కుంటానోళ్ల శివకుమార్ గ్రామ సర్పంచ్ నల్ల నర్సమ్మ లతో కలిసి ప్రారంభం చేసి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం శారీరిక దారుడ్యంతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని ఇలాంటి టౌర్నమెంట్ లు  నగరాలకే పరిమితం కాకుండా ఈ విదంగా గ్రామాలకు విస్తరించడం వల్ల మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని గెలిచిన వారు పొంగిపోకుండి ఓడిన వారు కృంగకుండా గెలుపోటములను క్రీడా స్పూర్తీతో తీసుకొని ముందుకు సాగి క్రీడలలో మంచి పేరు తేవాలన్నారు ఇందులో విన్నర్ అయిన టీంలకు ట్రోపి అందజేసాం అన్నారు
ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహిత దేశాబోయిని నర్సింహులు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కుంటానోళ్ల శివకుమార్ ఉపసర్పంచ్ కనకరాజు నల్ల యాదగిరి లింగ కనకయ్య స్వామి చెల్లి మహేష్ కరుణాకర్ నాగరాజు శ్రీనివాస్ దుంపలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal