సింగసముద్రము ఆయకట్టు నీటి విడుదల. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలని ఎల్లారెడ్డిపేట మండల ఆయకట్టు వరప్రదాయిని సింగసముద్రం నీటిని ఎల్లారెడ్డిపేట,బొప్పపూర్ కోరుట్లపేట సర్పంచ్ ల ఆధ్వర్యంలో సింగసముద్రము నీటిని విడుదల చేశారు. ఈ నీటి ద్వారా 1800 ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని నీరటిలకు ఆయా గ్రామాల సర్పంచ్ లు వారికి సూచించారు.ఈ నీటి విడుదల కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, బొప్పపూర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి,కోరుట్లపేట సర్పంచ్ మేడిపల్లి దేవానందము,ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ తో పాటు మూడు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
