Breaking News

దళితబంధు మొదట ఉపకులాలకే ఇవ్వాలి

166 Views

 

సిద్దిపేట జిల్లాలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకే దళితబందు పథకాన్ని మొదటగా అందించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ చేసారు. ఈ మేరకు నేడు సిద్దిపేట జిల్లా కలెక్టరెట్ లో జరిగిన ప్రజావాణి లో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పిన్నింటిదాసు చిందు తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా లోని ఎస్సీ ఉపకులాలైన మోచి, చిందు, మాలజంగం, బేడ(బుడ్గ)జంగం,హోలియదాసరి, సమగర, బైండ్ల, డక్కలి, గోసంగి, మాస్టిన్, మిత అయ్యావార్లు తదితర ఎస్సీ ఉపకులాల ప్రజలు ఈనాటికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందుకోలేక అన్యాయానికి గురయ్యారని ఈసారి రెండవ విడత దళితబందు పథకంలో 49శాతం యూనిట్లు ఎస్సీ ఉపకులాలకే కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు బుడాల సత్యరాజ్ మాలజంగం, పస్తంరవి బేడబుడ్గజంగం,బుజంగం చిందు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *