జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11
గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండల కేంద్రం ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న స్థలంలో గౌడ సంఘం సమావేశ మందిరానికి నిధులు కేటాయించాలని మెదక్ డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ని జగదేపూర్ మండల గీత పారిశ్రామిక సంఘం కార్యవర్గ సభ్యులు కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీకు సహాయం చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి జయమ్మ అర్జున్ గౌడ్, గీత పారిశ్రామిక సంఘం జగదేపూర్ అధ్యక్షులు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు నర్సింలు గౌడ్, ములుగు వైస్ పిఎస్‌ఎస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్, రాజుగౌడ్ ఆంజనేయులు గౌడ్ వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు
