ముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 20, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మారుతి ఓమ్ని వ్యాన్ లో సంగారెడ్డి నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి వస్తుండగా సోమవారం రాత్రి ఇతని వాహనాన్ని ఎనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన విరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సంతోష్ (27) అనే యువకుడు సోమవారం సంగారెడ్డి జిల్లాకు వెళ్లి తిరిగి అదే రోజు స్వగ్రామానికి వస్తుండగా సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామం వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో వెనకాల నుంచి ఏదో గుర్తుతెలియని వాహనం అతి వేగంతో అజాగ్రత్తగా ఢీకొట్టడంతో సంతోష్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న శివంపేట ఎస్సై రవి కాంతారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల లింగం ఏకైక కుమారుడు సంతోష్ గ్రామంలో, అతని మిత్రుడు తో అమాయకంగా కలివిడిగా ఉండేవాడని నిన్నటి రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాకపోగా తల్లి తండ్రి ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు. మంగళవారం రోజు మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
