ప్రాంతీయం

నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసిన ఎంపీ కి కృతజ్ఞతలు వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

120 Views


నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మానం కోసం నిధులు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభా కర్ రెడ్డికి కృతజ్ఞతలు అని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా నియోజకవర్గంలో అనేక గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు లేక ఆయా గ్రామాల ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని నూతన గ్రామపంచాయతీ భవ నాలు నిర్మించేందుకు నియోజకవర్గంలో 25 గ్రామా లలో రూపాయలు 20 లక్షల చొప్పున ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందు ఎంపీ కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.14 సంవత్సరాలు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సాదించుకుంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ కృషి చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం చేయడం హర్ష ణీయం అన్నారు. గత కొన్ని ఏళ్లుగా పంచాయతీ భవనాలు లేక సర్పంచు లు, ఆయా గ్రామ ప్రజలు అద్దె భవనాలలో అవస్థ లు పడ్డారని గుర్తు చేశారు. వీటిని నిర్మాణంతో అన్ని గ్రామాలలో పంచాయతీ భవనాలు నిర్మాణం పూర్తి అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్