ప్రభుత్వ పాఠశాలలో సుదీక్ష పుట్టిన రోజు వేడుకలు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని అంగడికిష్టపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న బాలకిషన్ కూతురు సుదిక్ష పుట్టినరోజు సందర్భంగా బుధవారం పాఠశాలలోని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిళ్లు ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు హరిక మాట్లాడుతూ ప్రార్ధించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పాఠశాల విద్యార్థుల అవసరాన్ని గ్రహించిన ప్రధానోపాధ్యాయులు తన కూతురు పుట్టిన రోజూ వృధా ఖర్చులకు పోకుండా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించి ఉదారత చాటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలకిషన్,ఉపాధ్యాయులు చిన్ని కృష్ణ, హారిక విద్యార్థులు తదితరులు ఉన్నారు.
