24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం మర్కుక్ గ్రామానికి చెందిన
అచ్చం గారి భాస్కర్ సర్పంచ్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కూక్ కు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పుష్పగుచ్చము శాలువాతో ఈరోజు పాఠశాల అసెంబ్లీ సమయంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సర్పంచ్ భాస్కర్ సేవలను కొనియాడడం జరిగింది. సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తన శాయ శక్తుల కృషి చేశనని, ఇక ముందు కూడా తన వంతు సహాయం చేస్తానన్నారు. దాంతోపాటు మార్చిలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో 10 జి పి ఏ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశం, ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీనివాస రావు, నరహరి ప్రసాద్, రమేష్, వందనా మేడం, భూజాత, రమణారావు, పద్మా రెడ్డి, విద్యాధర్ రెడ్డి, నాగేశ్వరరావు, సంతోష, రజినీ, సిద్ధయ్య, భ్రమరాంబ మేడం, కృష్ణ, శ్రీలత విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.





