విధి ఆడిన వింత నాటకంలో ఎవరు అతీతులు కారని విధిరాతను మార్చడం ఎవరి తరం కాదని మూడు రోజుల వ్యవధిలో గుండెపోటుతో తల్లి కొడుకులు మృతి చెందిన విషాదకర సంఘటన మరే కుటుంబానికి రావద్దని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో మూడు రోజుల వ్యవధిలో కొడుకు కొప్పు సత్యనారాయణ, తల్లి కొప్పు రామవ్వ ఇద్దరు మృతి చెందరు. మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేగంపేట గ్రామానికి చెందిన కొప్పు సత్యనారాయణకు ఉన్న కొద్దిపాటి భూమి రీజనల్ రింగ్ రోడ్ లో పోవడం రెండు సంవత్సరాల క్రితం తండ్రి సత్తయ్య పక్షవాతానికి గురై ఆరోగ్యంతో ఉండగా తల్లి రామవ్వకు గుండెపోటురాగా పది రోజుల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేపించగా కోలుకుంటుంది. వీటికి తోడు సత్యనారాయణకు ముగ్గురు కూతుర్లు ఉండటం వారి చదువులు పెళ్లిళ్ల గురించి తీవ్ర మనోవేదనకు గురికావడంతో హాస్టల్లో చదువుతున్న కూతురు రమ్య వద్దకు వెళ్దామని బయలుదేర సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృత్యువాత పడటం చాలా బాధాకరం. ఆయన మృతి చెందిన మూడు రోజులకే తల్లి రామవ్వ కూడ మృతి చెందింది. ఇలా మూడు రోజుల వ్యవీధిలోనే తల్లి, కొడుకులు మృతి చెందడం దానికి తోడు సత్యనారాయణ తండ్రి సత్తయ్య కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడటం ఆ కుటుంబం కోలుకోలేని విషాదకర సంఘటనలో మునిగిపోయింది. సత్యనారాయణకు భార్య హేమలత, ముగ్గురు కూతుర్లు మౌనిక, అశ్విత, రమ్య ఉన్నారు. వారు కన్నీటి సంద్రంలో మునిగిపోయరు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఇలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదని అసలే నిరుపేద కుటుంబ యజమాని మృతితో రోడ్డున పడ్డారు. వారి ముగ్గురు పిల్లలని పోషణ పెళ్లిళ్లు చేయడం హేమలతకు తలకు మించిన భారం అవుతుంది. ఈ కుటుంబానికి ధనవంతు సహకారంగా 5,000/- వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగిందని, ఇంకా మానవతావాదులు ధనవంతులు ముందుకు వచ్చి సహాయం చేయాలని అలాగే ప్రభుత్వం ఆర్.ఆర్.ఆర్ వీరు భూమి పోతుంది. కాబట్టి ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బేగంపేట సర్పంచ్ ప్రవీణ్, సామాజిక కార్యకర్త మహమ్మద్ ఉమర్, స్థానికులు స్వామి, నాగరాజు, మహేష్, ఎల్లయ్య, శంకరయ్య, నర్సింలు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
