ప్రాంతీయం

సింగారంలో గ్రంథాలయ వారోత్సవాలుగ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

134 Views

గ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలని,పుస్తకాలు చదువాలనీ జ్ఞానం పెంచుకోవాలనీ, మారుమూల మన సింగారంలో గ్రంథాలయం ఏర్పాటు చేయించిన స్వచ్ఛంద సేవాసంస్థ అభీనందనీయమనీ, అని సింగారం గ్రామ సర్పంచ్ మంగోలి నర్సాగౌడ్ అన్నారు
సేవాసంస్థ అధ్యక్షులు కోల నారాయణ మాట్లాడుతూ మాసేవలన విస్తరిస్తామని, విద్యార్థులు, యువత గ్రంథాలయం ఉపయోగించుకునీ ఉద్యోగాలు సాధించాలన్నారు.
బాలసాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ఎస్.ఆర్ రంగనాథన్ గ్రంథాలయోద్యమంలో కృషి చేశారని భారత గ్రంథాలయ పితామహుడు అని సేవలు మరువలేనివని, పుస్తకపఠనంతోనే అంబేడ్కర్లాంటి మహనీయులు తయారయ్యారనీ విద్యార్థులు చదువాలన్నారు.
సింగారం గ్రామంలో గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సందర్భంగా భారత గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ ఫోటోకు పూలమాలాలంకరణ చేశారు. సింగారం స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక పోటీలు నిర్వహించగా విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. వ్యాసరచన,ఉపన్యాస,పాటలు మరియు చిత్రలేఖణం పోటీలలో వరుసగా ప్రథమ స్థానంలో ముష్కమ్ సాత్విక్ , వాసరవేణి హాసిని, ఆకారం కృపారాణి, షేక్ అమీర్ లు ద్వితీయస్థానంలో గోనె సాగరిక, గనగోని రుత్విక ,బొమ్మడి లాస్య, సంపంగి లావర్ధన్ లు తృతీయ స్థానంలో వి.హాసిని, జాగిరి రిష్విత, మంగోలి ఉద్దవ్ ,టి.వంశీ లు విజేతలు అయిన విద్యార్థులకు అతిథులచేతులమీదుగా బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో *ఉపసర్పంచ్ షేక్ ఉస్మాన్, సింగారం స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షులు కోల నారాయణగౌడ్, ప్రధానకార్యదర్శి ఉస్మాన్ ఉపాధ్యక్షులు రచయిత డా.వాసరవేణి పరశురాం, కోశాధికారి గనగోని శ్రీనివాస్, పుటకుల్ల అంజయ్య, ద్యాగల యెల్లం, గ్రంథాలయం హించార్జి గొరిటం శ్రీనివాస్ రాములు ఎమ్.స్వామివిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7