సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని బందారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైనటువంటి చెప్యాల రవి (35) గత కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి వారి కుటుంబానికి 5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్.జే.బి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా ఆపద వస్తే నేనున్నానంటూ ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.జే.బి ట్రస్ట్ సభ్యులు చందా రాజు. ఉమ్మడి మండలాల మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు, పోతరాజు రవిందర్, ఎంపీటీసీ జోడు నవీన్, రామారం టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
