ముస్తాబాద్ జనవరి 31 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రజాగద్దర్ దేశవ్యాప్తంగా తాడిత పీడిత శ్రామిక వర్గాలపై పెత్త నందారుల దోపిడీకి వ్యతిరేకంగా తన కలాన్ని కదిలించి గళాన్ని వినిపించి ఆయన పాటకు సారథ వహించి ప్రజాస్వామ్య పౌర హక్కులు స్వేచ్ఛాయుత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అపర మేధాశక్తి గద్దర్ ఆయనకు నేడు ముస్తాబాద్ మండల మండలంలోని రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద యుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ పాత్రికేయులు మాట్లాడుతూ గద్దర్ మరణించాక కూడా ప్రజల గుండెల్లో నిలిచి చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. పలు వర్గాల పీడిత ప్రజల శ్రమదోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి సేవలు ఎనలేనివని, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతి పరిచిన మేధావని తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ కు సముచిత స్థానం ఇచ్చిందని నేడు వారులేని మాట కాకుండా
ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అవధూత శేఖర్, రాచమడుగు వెంకటేశ్వరరావు, చెవుల మైలారం, కస్తూరి వెంకటరెడ్డి, బరిగె రమేష్, గున్నాల పరుశరాములు గౌడ్, కడమంచి రవి, పలువురు ప్రజా ప్రతినిధులు, కుర్ర సావిత్రి తదితరులు పాల్గొన్నారు.




