సామాజిక కార్యక్రమాలు చేపట్టడమే లయన్స్ క్లబ్ మిత్ర లక్ష్యమని లయన్స్ క్లబ్ మిత్ర అధ్యక్షులు బుద్ద నాగరాజు అన్నారు మంగళవారం వార్డు సభ్యులు బుద్ధ చిన్న సత్యం దంపతుల పెళ్లిరోజు సందర్భంగా జగదేవపూర్ లోని రెండు అంగన్వాడి సెంటర్ లో చిన్నారులకు దాదాపు 40 బోజనం ప్లేట్లు స్పున్,అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా లయన్స్ క్లబ్ మిత్ర సేవలను అన్ని రకాల సేవ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో విస్తరింప చేస్తామని, లయన్స్ క్లబ్ సభ్యులు వార్డ్ సభ్యులు బుద్ద చిన సత్యం పెళ్ళి రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బుద్ధ చిన్న సత్యం అమర రాము జిల్లా కిరణ్ వార్డు సభ్యులు బాలనర్సయ్య గణేష్ నాయకులు కందుల బాలరాజు హరి ప్రసన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
