ముస్తాబాద్, జనవరి19 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, పోషణ అభియాన్, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఓటర్ అవగహన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఉన్నత అధికారులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం అధికారులు పలు అంశాలపై వివరిస్తూనే గ్రామ ప్రజలకు పథకాల గురించి అవగాహనా కల్పించారు. మహిళలు, చిన్నారులు, గ్రామ ప్రజలు, ముఖ్య నాయకులు, వివిధ హోదాలు కలిగిన అధికారులు, పాల్గొనడం జరిగిందని మేజర్ గ్రామ గ్రామపంచాయతీ ఇంచార్జ్ శ్రీనివాస్ (పంచాయతీరాజ్ సుపర్వైజర్) తెలిపారు.
