సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయం వద్ద గల కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో మంగళ వారం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ గుప్తా కు శాలువా కప్పి ఘన సన్మానం నిర్వహించారు ఈసందర్భంగా వాసవి సేవాసమితి నాయకులు మహేందర్ మాట్లాడుతూ గోలి సంతోష్ కు ఇటీవల కె పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వివేకానంద ఐకాన్ అవార్డ్స్ వారి ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం బిర్లా మందిర్ లో రైతు నేస్తం అవార్డు కన్నతల్లి ఫౌండేషన్ చైర్మన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది అని ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని ,గోలి సంతోష్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ నిరుపేద రైతులకు ఉచితంగా విత్తనాలను అందించి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి కరోనా కష్టకాలంలో నిత్యవసర సరుకులు నిరుపేదలకు అన్నదానం చేసి వివిధ సందర్భాలలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న గోలి సంతోష్ కు రైతు నేస్తం అవార్డు రావడం సంతోషకరమని అన్నారు ఈకార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అర్చకులు శంకర్ పంతులు,కైలాస ప్రశాంత్,ఉమేష్, సిద్ధి నవీన్, తదితరులు పాల్గొన్నారు




