నేడు మంచిర్యాల పట్నంలోని జన్మభూమి నగర్ లో బీసీ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీ జనాభా ప్రాతిపదికన 9 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉంటే రాష్ట్రంలో బీసీల ఓట్ల శాతం 54 పాయింట్ 75% ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లతోనే సాధ్యమైన విషయం అధికార ప్రతిపక్ష పార్టీలు విస్మరిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే బీసీ జనాభా ప్రాతిపదికన ఇప్పటివరకు ఏ పార్టీ బీసీలకు అవకాశాలు కల్పించిన దాఖలాలు లేకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలను వివక్ష గురి చేయడమే అవుతుంది.
76 ఏళ్ల ప్రజాస్వామ్యంలో బీసీలకు జనాభా ప్రకారం ఏ రంగంలో ఏ పార్టీ అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలను బీసీ జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ ఏ పార్టీ కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవు.
ఇప్పటికైనా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బీసీలకు తొమ్మిది పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ పార్టీలు బీసీల అగ్రహానికి గురికాక తప్పదని అని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నవారు బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, బీసీ సంఘాల రాష్ట్ర నాయకుడు గజెల్లి వెంకటయ్య జైపాల్ సింగ్ పట్టణ అధ్యక్షులు బోడెంకి మహేష్ శ్రీపతి రాములు అంకం సతీష్ అరేందుల రాజేశం ఎం వెంకటేశ్వర్లు కొత్తకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.






