బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెన్నార్ ట్రస్టు అండగా నిలుస్తుందని ఉమ్మడి మండలాల మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు దుబ్బాక నియోజకవర్గం ఎమ్ ఎన్ ఆర్ ట్రస్ట్ బాధ్యులు చందా రాజు, పోతరాజు రవీందర్ లు అన్నారు. బేగంపేట్ గ్రామానికి చెందిన ఎర్ర సత్య నారాయణ అకాల మరణాన్నికి ఎమ్మెన్నార్ ట్రస్టు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహకారంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్ర సత్యనారాయణ అకాల మరణం చెందడం చాలా బాధాకరం, ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్ద ప్రవీణ్, ఉపసర్పంచ్ ఉప్పు సత్తయ్య, బిక్షపతి, శంకర్, ఎల్లం, కనకరాజ్ సత్యం, సంజీవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
