నాలుగవ రోజు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం
-పూజలో పాల్గొన్న బెల్దే నరేష్ సౌజన్య దంపతులు
సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు పూజలో బెల్దే నరేష్ సౌజన్య దంపతులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి టోకెన్ చీర 101 రూపాయలతో టోకెన్ తీసుకుని భక్తులు అమ్మవారి కృపాకటాక్షాన్ని పొందగలరని శరావళి మాత ఉత్సవ సేవ సమితి తెలిపారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు దేశాయి కార్తీక్ శర్మ,శరావళి మాత ఉత్సవ సేవ సమితి సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
