రాజకీయం

ఎమ్మార్వో మెమోరండం ఇచ్చిన పట్టణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు: మర్కంటి ఏగొండ*

128 Views

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర, బీజేపీ రాష్ట్ర, అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపుమేరకు గజ్వేల్ లో పట్టణంలో పట్టణ, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు మర్కంటి ఏగొండ, పంజా బాలు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కు మెమోరండం గజ్వేల్ పట్టణ మండల శాఖ తరపున ఇవ్వడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ ఎలాంటి సురేష్, బిజెపి సిద్దిపేట జిల్లా కార్యదర్శి పాలకొల్లు వెంకటరామిరెడ్డి, మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి 2018 ఎన్నికలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఒక్క లక్ష రూపాయల వ్య వసాయరుణమాఫీ వడ్డీతో సంపూర్ణంగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల భీమ యోజన తెలంగాణలో అమలు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము తన వంతు ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలి తరుగు తాలూ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రైతులను నష్టపరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి హమాలీ చార్జీలు రైతుల వద్ద వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన వేలాదిమంది రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది వెంటనే ధరణి పోర్టల్ ను సమీక్షించి రైతుల ఇబ్బందులు తొలగించాలని బిజెపి కిసాన్ మోర్చా పట్టణ మండల శాఖ రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, లేనిపక్షంలో రైతుల తోటి ధర్నా చేసే కార్యక్రమాన్ని కూడా వెనుకాడమని ప్రభుత్వాన్ని కి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, గజ్వేల్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్, బిజెపి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి , గజ్వేల్ మండలం ప్రధాన కార్యదర్శి పంజాల అశోక్, బిజెపి కిసాన్ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు తుమ్మ గణేష్, తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7