Breaking News

ఖాజీపూర్ అభివృద్ధి కి కృషి చేస్తా. – రేణుక ఫంక్షన్ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు భూమి పూజ. -మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి

99 Views

ఖాజీపూర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ లో ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా రేణుక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. విడతల వారీగా కాజీపూర్ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీని వారు ఘనంగా సన్మానించారు.

– ఎల్లమ్మ తల్లికి ఎంపీ ప్రత్యేక పూజలు

రేణుకా ఎల్లమ్మకు ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్త మద్దతు అందేలా దీవించాలని అమ్మవారిని కోరారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka