దౌల్తాబాద్: పరిశుభ్రత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రుణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 4 లక్షల డ్రైనేజీ, రూ. 5.లక్షల సిసి రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కొమ్మెర పూజిత వెంకటరెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు రైమోద్దీన్ తో కలిసి జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య గ్రామాలే లక్ష్యంగా పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి పథంలో నిలుపుతుందన్నారు. అదేవిధంగా దొమ్మట అంబేద్కర్ విగ్రహం నుంచి ఉప్పరపల్లికి వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ ఎంపీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రావు, మండల కో ఆప్షన్ సభ్యుడు హమ్మద్, ఉప సర్పంచ్ సింహాచలం, మాజీ ఏఎంసీ చైర్మన్ నర్రాసత్యం, వార్డు సభ్యులు కనకయ్య ,షబ్బీర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇప్ప దయాకర్, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




