చేబర్తి లో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
సిద్దిపేట్ జిల్లా అక్టోబర్ 06
సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామ్ దాస్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ ఎర్రబాబు అశోక్ గ్రామపంచాయతీ పాలకవర్గం, వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్ణాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతుంది అని ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా నిరుపేదలకు చేయూతను అందించడం సీఎం కేసీఆర్ దాతృత్వానికి నిదర్శమని, సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి లక్ష ఓట్లకు పైగా మెజార్టీ రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,గ్రామపంచాయితీ పాలక వర్గం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గ్యార మల్లేష్, గ్రామ రైతు భందు సమితి అధ్యక్షుడు జాలని బాల నరసయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బూరి రాములు, ప్యాక్స్ డైరెక్టర్ సంజీవులు,గ్రామ కో ఆప్షన్ సభ్యులు గుర్రాల సురేష్ ,గుడాల శేఖర్ గుప్తా,నాయకులు తోట సత్తయ్య,జయరామ్,బాలకృష్ణ,ఆంజనేయులు జర్నలిస్టు నరేష్ గౌడ్ ,యువకులు, మహిళలు ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు
