*టియూడబ్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్*
సెప్టెంబర్ 11
సిద్దిపేట జిల్లా. టియూడబ్యూజే (ఐజేయూ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా దాస జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నుకయ్యరు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో జరిగిన జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా సోమవారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వర్కింగ్ జర్నలిస్ట్ లందరికి ప్రభుత్వం మెరుగైన హెల్త్ కార్డులు అందించాలని కోరారు. పని చేస్తున్న ప్రతి విలేకరికి ఇంటి స్థలంను కేటాయించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకంతో ఎన్నుకకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా విరహత్ అలీ, జిల్లా అధ్యక్షులు కే. రంగా చారి, గజ్వేల్ ప్రాంతంతో పాటు జిల్లా జర్నలిస్ట్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
