రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ఆదివారం మండల అధ్యక్షులు ఇరిగి పరశురాములుఅధ్యక్షతన మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెళ్లి స్వామి గౌడ్, జిల్లా నాయకులు బందెల దేవరాజ్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చెక్కపెల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మానపల్లి సుధా హాజరయ్యారు.ముఖ్యంగా మండల కమిటీ నిర్మాణం, సెస్ ఎన్నికలు, జన కళ్యాణ్ దీవాస్ తదితర అంశాలపై చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఇరిగి పర్శ రాములు ను నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రమోట్ చేస్తూ, మండల అధ్యక్షులు గా మైసగళ్ళ అనిల్ ని నూతనంగా నియమించి మిగత కమిటీ సభ్యులను అలాగే కొనసాగించడం lజరిగింది. ఈ సందర్భంగా అతిథులుగా పాల్గొన్న నాయకులు మండల నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కరికె సతిష్, టౌన్ ప్రెసిడెంట్ ఎర్రోళ్ల బాలకిషన్, మండల మహిళా కన్వీనర్ రాఘపురం లక్ష్మీ, పార్టీ సీనియర్ నాయకులు దోసల ఉపెందర్, ఎగదండి రామస్వామి,గ్యార స్వామి,ఎడ్ల లింగం, మైసగళ్ళ రవి,గడ్డం రాకేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
