ప్రాంతీయం

ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి… మోదీ హామీలన్నీ నీటి మూటలే…

105 Views

◆◆ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి…
మోదీ హామీలన్నీ నీటి మూటలే…

◆◆గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..

దేశంలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గద్దెనెక్కిన మోదీ సర్కార్ ఉద్యోగాలు కల్పించక పోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ ఉన్న ఉద్యోగాలను వూడగొడుతుందని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు.మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలి పోయాయని అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువతను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని తీరా ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం వల్ల ఉన్న ఉద్యోగాలను కోల్పోతున్నారని అన్నారు.ముఖ్యంగా sc,st, obc విద్యార్థి యువకులు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.మోదీ ప్రభుత్వ అసమర్థత, అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని తద్వారా అన్ని రంగాల్లో భారత దేశ పరువు మంట కలిసి పోతుందన్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన సైనిక నియామకాల్లో కూడా కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిన చరిత్ర మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు.ఇవ్వాళ అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక,కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశం తిరోగమన స్థితికి చేరుకుందని,అంతర్జాతీయ సూచీల ప్రకారం నిరుద్యోగం,పేదరికం,ఆకలి దేశంలో పెచ్చరిల్లిపోతున్నాయనీ అన్నారు.మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు కానీ వారి సన్నిహితులు ఆధాని,అంబానీలు ప్రపంచ కుబేరులుగా ఎదిగి పోతున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఒక లక్షా ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని,మరో 80 వేలకు పైగా ఉద్యోగాలకు ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు ఇస్తుందని అన్నారు.బీజేపీ కేవలం అబద్ధాలను ప్రచారం చేస్తూ యువతలో తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేస్తుందని అన్నారు.తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే యువతలో విద్వేషాన్ని నింపుతున్నారు.తెలంగాణ చాలా చైతన్య వంతమైన సమాజం కల్గినదని,ప్రజలు యువకులు బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా నమ్మే పరిస్థితిలో లేరన్నారు.బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం కేంద్ర ప్రభుత్వం దేశంలో ఖాళీలను గుర్తించి అమలు చేయాలని అన్నారు.ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే కాదు ప్రైవేట్ రంగంలో కూడా అనేక అవకాశాలు కలోస్తుందని అన్నారు.బీజేపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు ఇవ్వాలని లేకపోతే ప్రజాక్షేత్రంలో మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాళ మాటకు కట్టుబడి అన్ని రంగాల్లో ఆదర్శనీయ పథకాలు తీసుకొచ్చారని అన్నారు.తెలంగాణ యువకులు,నిరుద్యోగులు మాటలకే పరిమితమయ్యే స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొట్టే బీజేపీ ఉచ్చులో పడొద్దని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి మీ జీవితాల్లో వెలుగులు నింపే ఉద్యోగాలను పొందాలని కోరారు.బీజేపీ నాయకులు ఇప్పటికైనా అబద్దపు ప్రచారాలు మానుకొని,మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఏటా కోటి ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయించాలని డిమాండ్ చేశారు.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel