రామగుండం పోలీస్ కమీషనరేట్
మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు.
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషిచేయాలి: గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్.
మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ సూచించారు.
ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind & plant a tree- Say no to drugs అనే నినాదం తో గురువారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన మరియు పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ…విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ కాలనీ, మీ చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీస్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమాచారం అందించిన వివరణ గోపిగా ఉంచబడుతుందన్నారు.
ఎసిపి, సీఐ, ఎస్సైలు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై రమేష్, భూమేష్, పోలీస్ సిబ్బంది, టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
