లాలా లజపటి రాయ్ జయంతి పురస్కరించుకుని మందారం ఆకు మీద అతి చిన్నగా లాలా లజపటి రాయ్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి శనివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన దేశ భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన కలారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు. సందర్భంగా వారు మాట్లాడుతూ లాలా లజపటి రాయ్ స్వతంత్ర సమర యోధులలో ఒకరు. భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. పంజాబ్ కేసరిగా బిరుదాంకితుడు. పంజాబ్ రాష్ట్రంలో జనవరి 28, 1865న మేఘా జిలా దుడికే గ్రామంలో జన్మించాడన్నాడు.
