Breaking News

మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన

7 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందిద్దాం : రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహనా.

గంజాయి, డ్రగ్స్ నిర్ములన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని ఒక మంచి ఉదేశ్యంతో మత్తుపదార్థాల నిర్ములన వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో బాగంగా ఈరోజు జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్  ముఖ్య అతిదిగా పాల్గొనడం జరిగినది.

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, భవిష్యత్తు రోజుల్లో మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది అని అన్నారు. విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యం పై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సీపీ  సూచించారు. గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్ములన గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యం గా రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మత్తుకు బానిస అవడానికీ అనేక కారణాలు ఉంటాయి పరిసరాల ప్రభావం, చెడు స్నేహితులు, సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్ళవద్దు. గంజాయి, డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు. ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ సమయం స్కూల్స్, హాస్టల్ లలో ఉంటారు కావున ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు. మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబధిత సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు. యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూన్న వారిపై కేసులు నమోదు చేశాం అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అధికారుల తో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు.

అనంతరం

మేము డ్రగ్స్ తీసుకొము, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు, స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం ” అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.

ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లా రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, జైపూర్ ఎస్ ఐ శ్రీధర్, బీమారం ఎస్ఐ శ్వేతా, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, సిసి హరీష్, కస్తూర్బా ప్రిన్సిపాల్. ఫణి బాల, సాంఘిక సంక్షేమ ప్రిన్సిపాల్. కోలా నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ కోటపల్లి ప్రిన్సిపాల్ బి. రమేష్ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, నార్కోటిక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్